పోస్ట్‌లు

అన్నమయ్య కీర్తన

చిత్రం
ఇలమేలు కోరేటి అలమేలుమంగమ్మ ఇకమేలుకోవమ్మ తెలవారె----తెలవారె కపిలధేనువు వచ్చె కడవలా క్షీరాబ్ధి పొంగిపొంగి తరంగవల్లులై పారే---(ఇలమేలు) నిదురలో ఉన్నారు నీవారు జ్ఞానసూర్యుని గాంచి కానకున్నారు  దిద్దుకోవాలమ్మ తీరుగా నీఇల్లు కన్నతల్లివి కనుక కన్ను తెరిపించి ముందుగా మా తల్లి మేలుకో ముద్దుగా మమ్మేలుకోలుపుకో---(ఇలమేలు) కకుభ సంతానాల వేదాలు శుకపిపాసులు పాడు సుప్రభాతాలు కానకున్నారమ్మ కలిలోన నరులు మేలుకొలుపులు పాడు మేలు మేలెంచి మత్తులో ఉన్నారు ఆదుకో మాతరో మామేలు కోరుకో (ఇలమేలు)