అన్నమయ్య కీర్తన



ఇలమేలు కోరేటి అలమేలుమంగమ్మ
ఇకమేలుకోవమ్మ తెలవారె----తెలవారె
కపిలధేనువు వచ్చె కడవలా క్షీరాబ్ధి
పొంగిపొంగి తరంగవల్లులై పారే---(ఇలమేలు)

నిదురలో ఉన్నారు నీవారు
జ్ఞానసూర్యుని గాంచి కానకున్నారు 
దిద్దుకోవాలమ్మ తీరుగా నీఇల్లు
కన్నతల్లివి కనుక కన్ను తెరిపించి

ముందుగా మా తల్లి మేలుకో
ముద్దుగా మమ్మేలుకోలుపుకో---(ఇలమేలు)

కకుభ సంతానాల వేదాలు
శుకపిపాసులు పాడు సుప్రభాతాలు
కానకున్నారమ్మ కలిలోన నరులు
మేలుకొలుపులు పాడు మేలు మేలెంచి

మత్తులో ఉన్నారు ఆదుకో
మాతరో మామేలు కోరుకో (ఇలమేలు)

కామెంట్‌లు